ఏడేళ్ళ బాలిక మీద కామాంధుడు అత్యాచారయత్నం

ఏడేళ్ళ బాలిక మీద కామాంధుడు అత్యాచారయత్నం

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరులో దారుణం చోటు చేసుకుంది. 7 సంవత్సరాల బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. షాపులో తినుబండారాలు కొనుక్కోడానికి వచ్చిన బాలికను నోరు మూసి రూమ్ లోపలికి లాక్కెళ్ళి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతని బారి నుండి తప్పించుకొని తల్లికి చెప్పింది ఆ చిన్నారి. అదేమని ప్రశ్నించడానికి వచ్చిన తల్లి పై దాడి చేసిన నిందితుడు, అక్కడి నుండి పరారయ్యాడు. బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు...