రేపు దేశవ్యాప్తంగా ఐదో విడత పోలింగ్

రేపు దేశవ్యాప్తంగా ఐదో విడత పోలింగ్

సోమవారం దేశ వ్యాప్తంగా ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఐదో విడత ఎన్నికల్లో ప్రముఖుల భవితవ్యం తేలనుంది. ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, జయంత్‌ సిన్హా, నిరంజన్‌ జ్యోతి, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌- 14, రాజస్థాన్‌- 12, మధ్యప్రదేశ్‌- 7, పశ్చిమ బెంగాల్‌- 7 స్థానాలు, బిహార్‌- 5, జార్ఖండ్‌- 4, జమ్ముకాశ్మీర్‌లో 2 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.