తుది దశ పోలింగ్ ప్రారంభం..

తుది దశ పోలింగ్ ప్రారంభం..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తుది దశ పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం వరకు కొనసాగనుంది. తుది దశ ఎన్నికల బరిలో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు మనోజ్‌ సిన్హా, రవి శంకర్ ప్రసాద్‌, ప్రముఖ సినీనటులు రవికిషన్, కిరణ్‌ ఖేర్‌, శతృఘ్న సిన్హా  తదితరులున్నారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రాలవారీగా చూసుకుంటే బిహార్‌లో 8 స్థానాలు, ఝార్ఖండ్‌లో 3 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 8 స్థానాలు, పంజాబ్‌లో 13 స్థానాలు, పశ్చిమబెంగాలో 9 స్థానాలు, చండీగఢ్‌లో 1 స్థానం,  ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలు, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4 లోకసభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.