దివ్యాంగులకు రూ. 3,016ను ఫించన్‌గా అందజేస్తాం

దివ్యాంగులకు రూ. 3,016ను ఫించన్‌గా అందజేస్తాం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్ లో దివ్యాంగుల ఆశీర్వాద సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆర్ అన్నారు. కనీస అవసరాలకు సరిపోకుండా గత ప్రభుత్వాలు రూ. 200 ఫించన్ మొక్కుబడిగా ఇచ్చి చేతులు దులుపుకొన్నాయని ఆరోపించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు దివ్యాంగులకు రూ. 1500 ఫించన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని అన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ. 3,016ను ఫించన్‌గా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తమ జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందంటూ దివ్యాంగ సంఘం నేతలు వ్యాఖ్యానించారు. అందుకు కృతజ్ఞతగానే ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపటి ఎన్నికల్లో యావత్ దివ్యాంగులు టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేస్తామంటూ ఈ సందర్భంగా తీర్మానం చేశారు.