ఆ 15 మంది ఎవ్వరో?

ఆ 15 మంది ఎవ్వరో?

సగటు క్రికెట్ ప్రేక్షకుడు ఎంతగానే ఎదురుచూసే క్రికెట్ వరల్డ్ కప్ త్వరలోనే ప్రారంభం కానుంది... వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం ఆతృతగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇక వరల్డ్‌ కప్‌లో భారత్ తరపున బరిలోకి దిగనున్న 15 మంది ఎంపిక మాత్రం ఇవాళే జరగనుంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. ఈరోజు ముంబైలో సమావేశమై టీమిండియాను ఎంపిక చేయనుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు కోచ్‌ రవిశాస్త్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంతకు ముందే ప్రపంచకప్‌ జట్టు ఖరారైనట్టుగా భావించినా.. టీమిండియా ఆడిన చివరి రెండు మూడు సిరీస్‌ల్లో కొందరు ఆటగాళ్ల ప్రదర్శనలో నిలకడ లేకపోవడంతో మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై ముందే ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. అయితే, జట్టులో దాదాపు 13 స్థానాలు ఖాయంగా కనిపిస్తోన్న.. ఇంకో రెండు బెర్తుల విషయంలోనే సందిగ్ధత నెలకొంది. మొత్తానికి ఈ సందిగ్ధతకు నేడు తెరపడనుంది. 

ఇక జట్టు అంచనా ఇలా ఉంది.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శిఖర్‌ ధావన్, జాదవ్, హార్దిక్ పాండ్యా, శంకర్, కుల్దీప్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీ, జడేజా, కార్తీక్/పంత్ (అదనపు వికెట్ కీపర్), రాహుల్/రాయుడు (స్పెషలిస్ట్ ఓపెనర్/నాలుగో స్థానం), ఉమేష్‌ యాదవ్/ఖలీల్/ఇషాంత్ శర్మ/సైనీ (అదనపు పేసర్)గా పరిశీలనలో ఉన్నాయి.