'పబ్‌జీని బ్యాన్‌ చేయాలట.. మీరేమంటారు?'

'పబ్‌జీని బ్యాన్‌ చేయాలట.. మీరేమంటారు?'

వివాదస్పదంగా మారిన ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్‌జీని బ్యాన్‌ చేయాలంటూ 11 ఏళ్ల బాలుడు బాంబే హైకోర్టు తలుపు తట్టగా.. దీనిపై స్పందించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని న్యాయస్థానం సూచించింది. పబ్‌జీపై నిషేధం విధించాలని కోరుతూ బాంద్రా ప్రాంతానికి చెందిన అహద్‌ నిజాం అనే 11 ఏళ్ల విద్యార్థి బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ గేమ్‌ వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. కోర్టుకెక్కడానికి ముందు మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. స్పందించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని కోరింది. కర్నాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో పబ్‌జీపై ఆంక్షలు విధించాయి.