పైనాపిల్ తో కరోనాకు చెక్...!!

పైనాపిల్ తో కరోనాకు చెక్...!!

ప్రస్తుతం ఎవరినోట విన్నా వినిపిస్తున్న పేరు  కరోనా. కరోనాకు ఇప్పటి వరకు వాక్సిన్ లేకపోవడంతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం అని వైద్యనిపుణులు చెప్తున్నారు.  వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారపదార్ధాలను తీసుకోవాలని, ముఖ్యంగా విటమిన్ సి, జింక్, ఫైబర్ ఉన్న ఆహార పదార్ధాలు, పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.  

విటమిన్ సి అధికంగా లభించే పండ్లలో పైనాపిల్ ఒకటి.  తక్కువ ధరలో మార్కెట్లో లభ్యం అవుతుంది.  ఇందులో విటమిన్ సి తో పాటుగా, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి అత్యవసర మూలకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.  పైనాపిల్ లో లభించే ఫైబర్ శరీరం ఎంతగానో ఉపయోగపడుతుంది.  అందుకే దీనిని జ్యూస్ మాదిరిగా కాకుండా ముక్కలుగా తినాలని  డైట్ నిపుణులు సూచిస్తున్నారు.