'నేను పార్టీ మారే ప్రసక్తే లేదు..'

'నేను పార్టీ మారే ప్రసక్తే లేదు..'

పార్టీ మారుతారన్న ప్రచారాన్ని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ ఖండించారు. తాను క్యారెక్టర్‌తో రాజకీయాలు చేసే వ్యక్తిని అని చెప్పారు.  ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని కొన్ని వ్యవస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 'నన్ను తెలుగుదేశం ఆదరించింది.. గౌరవించింది.. నేనెందుకు పార్టీ మారుతాను?' అని ప్రశ్నించారు. వైసీపీ తనతో మైండ్ గేమ్ ఆడుతోందన్న పితాని.. ఇటువంటి కుట్రలు తన దగ్గర పనిచేయవని అన్నారు.