తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు ప్రముఖులు

తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు ప్రముఖులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నేత తంబీదురై, కేంద్ర మంత్రి, బీజేపీ తమిళనాడు ఇన్ చార్జ్ పీయూష్ గోయల్ కలిసి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ వేదపండితులు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.