చంద్రబాబుపై కేంద్రమంత్రి ఫైర్ !

చంద్రబాబుపై కేంద్రమంత్రి ఫైర్ !

మోడీపై విమర్శలు చేస్తున్న చంద్రబాబుపై కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ధ్వజమెత్తారు.  విజయనగరంలో మాట్లాడిన ఆయన అశోక్ గజపతిరాజు ఎంపీగా గెలవడానికి మోడీ ఏంతో సహకరించారని అన్నారు.  మొదట్లో అడిగిన దానికంటే కేంద్రం ఎక్కువే సహాయం చేస్తోందన్న బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.  ఆయనకు ప్రజామోదం లేదని మా సర్వేల్లో తేలిందని తెలిపారు. 

ఇంకా 'రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు లెక్క చెప్పమంటే చెప్పడంలేదు.  పోలవరం ప్రోజెక్టుకి జాతీయ హోదా కల్పించి, నిధుల మంజూరు చేస్తే.. దోచుకోవలసినంత దోచుకున్నారు.  ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ చంద్రబాబు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదావలన ఒరిగేది ఏమీ లేదు. అన్నీ ఆలోచించే రైల్వే జోన్ ఇచ్చాం' అన్నారు.