భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడి... పీయూష్ గోయల్ రియాక్షన్ ఇలా...!

భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడి... పీయూష్ గోయల్ రియాక్షన్ ఇలా...!

ఓ వైపు తాము భారత్‌లో 1 బిలియన్ డాలర్లు దాదాపు రూ.7100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అమోజాన్ సిద్ధమైంది... ఈ విషయాన్ని అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించారు... చిన్న, మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు గాను భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సంభవ్‌ సమ్మిట్‌లో జెఫ్‌ బెజోస్‌ ఈ విషయాన్ని చెప్పారు. అయితే, దీనిపై స్పందించిన కేంద్రమంత్రి పియూష్ గోయల్... అమెజాన్ ఏమీ భారత్‌కు గొప్ప సాయం చేయడం లేదు అని వ్యాఖ్యానించారు.  దయచేసి లేఖ మరియు చట్ట స్ఫూర్తిని అనుసరించండని, లొసుగులను కనుగొనడానికి ప్రయత్నించొద్దని నేను  పెట్టుబడిదారులకు చెప్పానన్న గోయల్.. వారు ఒక బిలియన్ డాలర్లను పెట్టవచ్చు... కానీ, వారు ప్రతి సంవత్సరం ఒక బిలియన్ డాలర్లను కోల్పోతుంటే, వారు సరదాగా బిలియన్ డాలర్లకు ఫైనాన్స్ చేయవచ్చు. కాబట్టి వారు ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినప్పుడు వారు భారతదేశానికి గొప్ప సహాయం చేస్తున్నట్లు కాదు అని పేర్కొన్నారు. కాగా, 2025 నాటికి 10 బిలియన్‌ డాలర్ల విలువైన మేకిన్‌ ఇండియా ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా ఎగుమతి చేసేలా లక్ష్యాలు నిర్దేశించుకున్నామని బుధవారం జెఫ్ బెజోస్ తెలిపారు. డైనమిజం, శక్తి, వృద్ధి భారత్ లో ఉందన్నారు. భారత్ చాలా ప్రత్యేకమైనదని, భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశమని జెఫ్ బెజోస్ అన్నారు. 21వ శతాబ్దం భారత్,అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాల మధ్య మరింత సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు.