తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి

తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి

తెలుగు టైటాన్స్‌ జట్టు వరుస పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. సొంత ప్రేక్షకుల మధ్య టైటాన్స్‌ వరుసగా రెండో పరాజయంను చవిచూసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా విశాఖ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 24– 37తో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓడింది. టైటాన్స్‌ స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 4 పాయింట్లు మాత్రమే చేసాడు. నీలేశ్‌ 6 పాయింట్లు సాధించాడు. బుల్స్‌ తరఫున పవన్‌ 13 రైడ్ పాయింట్లు సాధించాడు. బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 47–37తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. గుజరాత్‌ తరుపున ప్రపంజన్ 12 రైడ్ పాయింట్లు సాధించాడు. గురువారం పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనుంది.