యుముంబా బోణీ...

యుముంబా బోణీ...

ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్ లో ఓడినా.. రెండవ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం జైపూర్‌ పింక్‌పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్ లో యుముంబా 39–32తో విజయం సాధించింది. యుముంబా రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ 13 పాయింట్లతో జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. అతనికి తోడు రోహిత్‌ బలియన్‌ 7 పాయింట్లు సాధించాడు.  పింక్‌పాంథర్స్‌ జట్టులో నితిన్‌ 8 పాయింట్లతో రాణించాడు. స్టార్ రైడర్ అనూప్‌ 4 నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌కు జైపూర్‌ జట్టు యజమాని అభిషేక్‌ బచ్చన్‌ సతీమణి ఐశ్వర్యరాయ్‌ హాజరయ్యారు.

మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ లీగ్‌లో శుభారంభం చేసింది. 48–37 స్కోరుతో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది. బెంగళూరు రైడర్ పవన్ 20 పాయింట్లతో చెలరేగాడు. కాశీలింగా కూడా 9 పాయింట్లు చేసాడు. దీంతో కాశీలింగా 500 మార్క్ రైడ్ పాయింట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళ్‌ కెప్టెన్ అజయ్ ఠాకూర్ 20 రైడ్ పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. గురువారం యూపీ యోధతో పట్నా పైరేట్స్.. తమిళ్‌ తలైవాస్‌తో బెంగాల్‌ వారియర్స్‌ తలపడతాయి.