ఇండియాలో ప్లాస్టిక్ రోడ్లు... 

ఇండియాలో ప్లాస్టిక్ రోడ్లు... 

ఇండియాలో ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించేందుకు రంగం సిద్ధం అయ్యింది.  దేశంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను తిరిగి వినియోగించేందుకు ఇండియా ప్రణాళికలు వేసింది.  బిపిసీఎల్ సంస్థ ప్లాస్టిక్ వ్యర్ధాలతో దిమ్మెలను తయారు చేసింది.  వాటిని రోడ్లు వేసేందుకు వినియోగిస్తున్నారు.  ప్లాస్టిక్ దిమ్మెలను రోడ్డుపై ఉంచిన తరువాత దానిపై రెండు పొరలుగా తారును వేస్తారు.  నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వే కు సమాంతరంగా రోడ్డును వేస్తున్నారు.  ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలో మిగతా ప్రాంతాలన్నింటిలో ప్లాస్టిక్ రోడ్లను వేయబోతున్నారు.  రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగం ఇదే మొదటిసారి అని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టం చేసింది.