లార్డ్స్‌లో చెత్తగా ఆడి ఓడాం

లార్డ్స్‌లో చెత్తగా ఆడి ఓడాం

లార్డ్స్‌ టెస్ట్‌లో చిత్తూగా ఓడిపోయిన భారత్‌ జట్టు.. తాము ఎక్కడ తప్పుచేశామో తెలుసుకునే పనిలో పడింది. పేసర్లకు అనుకూలించే పిచ్‌పైన ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా.. బోల్తా పడింది. జట్టు కూర్పుపై మాజీ ఆటగాళ్లు సైతం పెదవి విరిచారు. భారత జట్టు కోచ్‌ రవిశాస్త్రి సైతం ఇప్పుడు అదే అంటున్నాడు. 'ఓ విధంగా చూస్తే మేం తప్పు చేశాం. సీమ్‌ పిచ్‌పై స్పిన్నర్లను ఎంచుకుని ఓటమిని కొని తెచ్చుకున్నాం. స్పిన్నర్‌ బదులు మరో సీమర్‌తో బరిలోకి దిగుంటే ఫలితం మరోలా ఉండేది' అని అభిప్రాయపడ్డాడు. ఐతే.. ఆట ఐదో రోజుకు చేరుకుని ఉండుంటే.. స్పిన్నర్లు కచ్చితంగా ఉపయోగపడేవారని చెప్పుకొచ్చాడు. 
సీజనల్‌ స్పిన్నర్‌ అశ్విన్‌తోపాటు కుల్దీప్‌ యాదవ్‌కు భారత్‌ తుది జట్టులో స్థానం కల్పించింది. అంతా అనుకున్నట్టుగానే ఇద్దరూ స్పిన్నర్లూ ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు.