నేడే హౌడీ మోడీ...హాజరుకానున్న ట్రంప్

నేడే హౌడీ మోడీ...హాజరుకానున్న ట్రంప్


ప్రధాని నరేంద్ర మోడీ 74వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు అమెరికా వెళ్లారు. హూస్టన్ లో  ప్రవాస భారతీయులు ఏర్పాటు చేస్తున్న హౌడీ మోడీ సభలో ట్రంప్ తో కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగించడంతో పాటు. పెట్టుబడిదారుల సదస్సులకు హాజరౌతారు. ఈ నెల 27 వరకూ అమెరికాలో పర్యటించనున్న  ప్రధాని  ముందుగా హ్యూస్టన్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొంటారు.

ఇవాళ ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోడీ  పాల్గొని, ప్రసంగిస్తారు. ఆరోగ్యం, టెర్రరిజంపైనా మాట్లాడతారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును ఎండగట్టే అవకాశాలున్నాయి. తర్వాత మోడీ NRG స్టేడియంలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన చరిత్రాత్మక సదస్సులో పాల్గొంటారు. ఆ సదస్సుకు డొనాల్డ్  ట్రంప్ కూడా వస్తున్నారు. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొనే సభకు అమెరికా అధ్యక్షుడు రాబోతుండటం ఇదే మొదటిసారి.

అనేక మంది కాంగ్రెస్‌ సభ్యులు, మేయర్లు, అమెరికన్‌ ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా 90 నిమిషాల పాటూ కల్చరల్  ప్రోగ్రామ్స్ కూడా ఉండనున్నాయి. వీటిలో 400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. ఎన్నారైల సదస్సు తర్వాత 24న ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు మోడీ వెళ్తారు. అలాగే అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 150వ జయంతి  సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు.

అదే సందర్భంలో పారిశ్రామిక వేత్తలు, భారత ప్రతినిధి  బృందంతో   మాట్లాడతారు. ఆ తర్వాత 27న తిరిగి భారత్ వస్తారు. ఎన్నారైలతో తలపెట్టిన హౌడీ మోడీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తవుతున్నా హ్యూస్టన్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ వరదనీటితో ఉన్నాయి. టెక్సాస్‌ రాష్ట గవర్నర్‌ 13 కౌంటీలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దక్షిణ టెక్సాస్‌లో ప్రజలను బయటికి రావొద్దని అధికారులు  ఆదేశించారు. ప్రస్తుతం హౌడీ-మోడీ సభ జరిగే NRG స్టేడియం కూడా వాన నీటితో నిండిపోయింది. దాదాపు 1,500 మంది వాలంటీర్లు సభ  ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. సభ ప్రారంభమయ్యే సమయానికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటున్నారు.