బ్యాంకింగ్‌ స్కామ్ కాంగ్రెస్ పుణ్యమే

బ్యాంకింగ్‌ స్కామ్ కాంగ్రెస్ పుణ్యమే

బ్యాంకింగ్ రంగాన్ని కుదేలు చేసిన స్కామ్ లకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ప్రధాని మోడీ ఆరోపించారు. పోస్టల్ పే మెంట్ బ్యాంక్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎగవేతదారుల నుంచి ప్రతిపైసా వసూలు చేస్తామని మోడీ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఫోన్ బ్యాంకింగ్ మొదలైందని, ఓ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు ఫోన్లపైనే కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారని మోడీ ఆరోపించారు. రుణాలు వసూలు కావని తెలిసీ బ్యాంకుల అధిపతులు రుణాలు ఇచ్చారని, వీరిందరినీ నియమించిందీ ఆ కుటుంబ పెద్దలేనని పరోక్షంగా సోనియా గాంధీని విమర్శించారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు రెండు లేదా రెండున్నర లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొందని, వాస్తవానికి ఆ మొత్తం 9 లక్షల కోట్లని మోడీ అన్నారు.  ఎలాంటి మదింపు చర్యలు లేకుండా కోట్లాది రూపాయలు పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చారని, తరవాత పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో మరిన్ని కోట్లు వారికి కట్టబెట్టారని మోడీ ఆరోపించారు.