ఇమ్రాన్‌ఖాన్‌ ఆస్తి ఎంతో తెలుసా..?

ఇమ్రాన్‌ఖాన్‌ ఆస్తి ఎంతో తెలుసా..?

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు ప్రధాన రాజకీయ నేతల ఆస్తుల వివరాలను ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇమ్రాన్‌కు రూ.10.8 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు వెల్లడించింది. ఇమ్రాన్‌కు మూడు విదేశీ కరెన్సీ ఖాతాలున్నాయని పేర్కొన్న ఈసీ..150ఎకరాల వ్యవసాయ భూమి, రూ.50వేలు విలువ చేసే 4 మేకలు ఉన్నట్లు ప్రకటించింది. తన మొదటి భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ నుంచి ఇమ్రాన్‌కు బనీ గలా ఎస్టేట్‌‌ కానుకగా వచ్చింది. ఇక.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో ఆస్తి విలువ రూ.150 కోట్లు. పాక్‌ మాజీ అధ్యక్షుడు అసీఫ్‌ అలీ జర్దారీకి రూ.69 కోట్లు విలువైన ఆస్తులున్నాయి.