ఉద్యోగాలంటే మేకిన్ ఇండియా, స్టాండింగ్ ఇండియా అంటున్నారు

ఉద్యోగాలంటే మేకిన్ ఇండియా, స్టాండింగ్ ఇండియా అంటున్నారు

దేశంలో కోట్లాదిగా ఉన్న నిరుద్యోగ యువత ఉద్యోగాలు కావాలని అడిగితే మేకిన్ ఇండియా, స్టాండింగ్ ఇండియా అని ప్రధాని మోడీ ఉత్త మాటలు చెబుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు మోడీ, కాంగ్రెస్ మధ్య యుద్ధంగా అభివర్ణించారు రాహుల్. ప్రతి పేదకు కనీస ఆదాయ కల్పనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 2019 తర్వాత కనీస ఆదాయం అందేలా ఒక విధానం రూపొందిస్తామని.. పేదలను వెతికిపట్టి ఈ పథకంలోకి తెస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. దాంతో ప్రతి పేదవాడికి తప్పనిసరిగా కనీస ఆదాయం అందుతుందని చెప్పారు. కనీస ఆదాయ విధానంలో ఏ ఒక్కరినీ విస్మరించబోమని, పేదల అకౌంట్ లోకి నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. ప్రభుత్వ ధనాన్ని తాము పేదలకు పంచేందుకు వారి ఖాతాల్లో వేస్తామని.. కానీ మోడీ మాత్రం నీరవ్ మోడీ అకౌంట్లో వేస్తారని విమర్శించారు.