కాంగ్రెస్ పార్టీది విభజించి పాలించే విధానం: మోడీ

కాంగ్రెస్ పార్టీది విభజించి పాలించే విధానం: మోడీ

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ రోజు అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించాలనే విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. బీజేపీ ఇలాంటి వాటి జోలికి పోదని, అందరి వికాసం కోసం పాటుపడుతుందన్నారు. ఇది విభజనకు- వికాస్ కు మధ్య పోరని అన్నారు. కొందరు దేశాన్ని విభజించాలని అనుకుంటున్నారని, పరాక్రమ్ పర్వ్‌ను కూడా కొందరు అవమానిస్తున్నారని, జవాన్ల సాహసిక దాడులను కించపరస్తూ మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పటిష్టమైన ప్రతిపక్షం అవసరమని, అయితే 60 ఏళ్లుగా వైఫల్యాల మూటకట్టుకున్న వ్యక్తులను, విపక్షంగా కూడా విఫలమైన వారిని మనం చూస్తున్నామని అన్నారు. రాజస్థాన్ ప్రజల ఆశీస్సులు బీజేపీకి ఉన్నాయని, మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తారని ఆశీస్తున్నానని ప్రధాని తెలిపారు.