బెంగాల్ పాలిటిక్స్: ఒకే వేదికపై మోడీ, మమత... 

బెంగాల్ పాలిటిక్స్: ఒకే వేదికపై మోడీ, మమత... 

బెంగాల్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనేకమంది నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీలో చేరుతున్న సంగతి తెలిసిందే.  దీంతో ఈసారి పశ్చిమ బెంగాల్లో జరిగే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.  ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ చూస్తుంటే, బెంగాల్ కోటలో పాగా వేసేందుకు   కాషాయదళం ప్రయత్నాలు చేస్తున్నది.  ఇక ఇదిలా ఉంటె ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ కోల్ కతా వెళ్లారు.  అక్కడ నేతాజీ భవన్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు.  సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నేతాజీ స్మారక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయబోతున్నారు.  అదే విధంగా నేతాజీ బోస్ జయంతిని పరాక్రమ్ దివస్ గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. పరాక్రమ్ దివస్ లో ఒకే వేదిక మీద ప్రధాని మోడీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమత కలిసి కనిపించబోతున్నారు.  అయితే, ప్రధాని మోడీ కోల్ కతా వచ్చే ముందే ముఖ్యమంత్రి మమత బెనర్జీ భారీ ర్యాలీని నిర్వహించారు.  దీంతో బెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.