కర్తార్ పూర్ విషయంలో కాంగ్రెస్ విఫలం

కర్తార్ పూర్ విషయంలో కాంగ్రెస్ విఫలం

దేశ విభజన సమయంలో పవిత్రమైన కర్తార్ పూర్ సాహిబ్ ను భారత్ లో కలపడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రధాని మోడీ ఆరోపించారు. సిక్కుల 10వ గురువు గోబింద్ సింగ్ 350వ జయంతి వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా రూ. 350 విలువైన వెండి స్మారక నాణాన్ని మోడీ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన కర్తార్ పూర్ కారిడార్ ద్వారా వీసా లేకుండా భక్తులు పాకిస్థాన్ లోని గురునానక్ అంతిమ విడిదిని దర్శించుకోవచ్చని తెలిపారు. గురునానక్ 550 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ సీజేఐ జేఎస్ ఖేహర్ ఇతర సిక్కు నేతలు హజరయ్యారు.