ప్రధాని మోడీకి ఉపరాష్ట్రపతి అభినందనలు

ప్రధాని మోడీకి ఉపరాష్ట్రపతి అభినందనలు

ప్రధాని మోడీ ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైనందుకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉదయం వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని రాక సందర్భంగా వెంకయ్యనాయుడు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి ఢిల్లీ పీఠం అధిరోహిస్తున్నందుకు మోడీని వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ సందర్భంగా అభివృద్ధి, పార్లమెంటరీ వ్యవస్థల బలోపేతంపై చర్చించినట్లు సమాచారం.