రాష్ట్రానికి మోడీ చాలా చేశారు: కన్నా

రాష్ట్రానికి మోడీ చాలా చేశారు: కన్నా

ఏపీ రాష్ట్రానికి ప్రధాని మోడీ చాలా మేలు చేశారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఈ రోజు ఆయన గుంటూరులో మాట్లాడుతూ... చారిత్రాత్మకమైన పోలవరం నిర్మాణానికి వంద శాతం నిధులు ఇచ్చి రాష్ట్రానికి ఇచ్చిన గిఫ్ట్‌ను మరిచిపోలేమన్నారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రూ. 500 కోట్లతో విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, రెండు ఫ్లైఓవర్లు, ఎయిమ్స్ ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు ఇచ్చాం. ఇలానే రాష్ట్రానికి మోడీ చాలా మేలు చేశారు. మోడీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రాజెక్టులు, గ్రాంట్స్, సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఎంతో మేలు చేశారని కన్నా తెలిపారు. 

సీఎం చంద్రబాబుకి దమ్ముంటే గుంటూరులో నిలబడి ఐదేళ్ళు ఏం చేశారో చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు రైతుల పొట్టకొట్టి రియల్ వ్యాపారం చేశాడు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అవినీతి అరాచక పాలన చేశారు. ఓటుకి నోటు కేసులో దొంగలా దొరికి రాత్రికిరాత్రే చంద్రబాబు ఏపికి పారిపోయి వచ్చాడని ఆయన విమర్శించారు.