జాతీయ ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని

జాతీయ ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని

మూడు జాతీయ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం జాతికి అంకితం చేశారు. మోడీ ఆదివారం ఏపీ పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. విశాఖలో రూ.1178 కోట్లతో నిర్మించిన  వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రానికి శంఖుస్థాపన చేశారు. అలాగే కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మించిన బీపీసీఎల్‌ టర్మినల్‌ శంకుస్థాపన చేసారు. ఇక అమలాపురం వద్ద ఓఎన్‌జీసీ వశిష్ట, ఎస్1 ఆన్‌షోర్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రధాని ప్రారంభించారు.