వాస్తవాలు వివరించేందుకు మోడీ వస్తున్నారు: కన్నా

వాస్తవాలు వివరించేందుకు మోడీ వస్తున్నారు: కన్నా

వాస్తవాలు వివరించేందుకు ప్రధాని మోడీ విశాఖ వస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మార్చి 1న విశాఖలోని రైల్వే గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభ జరగనుంది. సభ నిర్వహించనున్న రైల్వే గ్రౌండ్ లోని ఏర్పాట్లను కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, నగర బీజేపీ నేతలు పరిశీలించారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ... ప్రధాని చెప్పే వాస్తవాలు ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. మోడీని ఆశీర్వదించాలి, మళ్లీ మోడీయే ప్రధాని కావాలని సభకు హాజరై మద్దతు ప్రకటించాలని కోరారు. రైల్వేజోన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, మా పార్టీ తరపున ఒక డెలిగేషన్ గా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ని కలుస్తాం, ఖచ్చితంగా రైల్వే జోన్ వస్తుందని కన్నా తెలిపారు. రైల్వేజోన్ అంశం విభజన చట్టంలో పరిశీలించమని ఉండటమే అసలు లోపం అని అన్నారు. ముంపు గ్రామాలను ఏపిలో మేము కలపమని పట్డుబట్టబట్టే పోలవరం కల సాకారమవుతోందని అయన పేర్కొన్నారు.