లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభించిన ప్రధాని

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభించిన ప్రధాని

ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని పీఎం మోడీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.  ఈ నిధి ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం చేసుకున్నాయి. 8.5 కోట్ల మంది రైతులకు  రూ.2 వేల చొప్పున అందిస్తారు. ఇందు కోసమే దాదాపు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, రైతులు తమ పంట దిగుబడులను కాపాడుకునేందుకు సదుపాయాలను కల్పిస్తారు. దీంతో పాటు రైతులకు ఇచ్చే  రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్‌ గ్యారంటీ ఇస్తారు.