తల్లిని కలిసిన ప్రధాని మోడీ 

తల్లిని కలిసిన ప్రధాని మోడీ 

మూడ్రోజులు గుజరాత్ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి మోడీ తన కన్నతల్లి హీరాబెన్ ను కలిశారు. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తూ ప్రధాని....గాంధీ నగర్ సమీపంలోని రైసన్ గ్రామానికి వెళ్లి తన తల్లి, కుటుంబ సభ్యులను కలిశారు. వారితో సుమారు అరగంట పాటు గడిపారు. తల్లి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. హీరాబెన్ తన చిన్న కుమారుడు పంకజ్ మోడీ ఇంట్లో ఉంటోంది. ప్రధాని 2017 సెప్టెంబర్ లో ఆయన తల్లిని కలిశారు. అప్పటి నుంచి మళ్లి ఇవాల కలుసుకున్నారు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రతి పుట్టినరోజుకు తల్లి ఆశీర్వాదం తీసుకునే వారు. ప్రధాని అయిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే... గత ఏడాది ఆమెను కలవలేక పోయారు.  సాధారణంగా తన జన్మదినం నాడు తల్లిని కలిసి ఆశీస్సులు అందుకునే మోడీ ఈసారి వైబ్రెంట్ గుజరాత్ సదస్సు కోసం సూరత్ వచ్చిన సందర్భంగా మోడీ తల్లిని కలుసుకున్నారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు.