ప్రభుత్వ ఏర్పాటుకు మోడీకి ఆహ్వానం

ప్రభుత్వ ఏర్పాటుకు మోడీకి ఆహ్వానం

కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎన్డీఏ ప్రతినిధుల మండలి రాష్ట్రపతిని కలిసి నరేంద్ర మోడీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్టు పత్రం సమర్పించింది. ఎన్డీఏలోని అన్ని భాగస్వామ్య పక్షాలు తమ మద్దతు పత్రాలను రాష్ట్రపతి కోవింద్ కు అందజేశాయి. 

సాయంత్రం జరిగిన ఎన్డీఏ, బీజేపీ ఎంపీల సమావేశంలో ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మోడీ రాష్ట్రపతి భవన్ కి వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఎన్డీఏ బృందం రాష్ట్రపతిని కలిసింది.

ఆ తర్వాత మోడీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికారిక సన్నద్ధతను తెలియజేశారు. మోడీ మే 30న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు.