కీలక సదస్సుకి ముఖ్య అతిథిగా మోడీకి ఆహ్వానం

కీలక సదస్సుకి ముఖ్య అతిథిగా మోడీకి ఆహ్వానం

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. సెప్టెంబర్ ప్రారంభంలో రష్యాలోని వ్లాదివోస్తోక్ లో జరగబోయే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోడీని పుతిన్ ఆహ్వానించారని మోడీ ఆ ఆహ్వానానికి అంగీకరించినట్టు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.

ఇద్దరు నేతల మధ్య ఎలాంటి అంతర్జాతీయ లేదా ప్రాంతీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని గోఖలే చెప్పారు. జరగబోయే వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి యాత్రను ఎలా సఫలం చేయాలనే దానిపైనే తమ దృష్టిని కేంద్రీకరించినట్టు ఆయన వివరించారు. జపాన్ లోని ఒసాకాలో జరగబోయే జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా, భారత్, చైనాలు త్రైపాక్షిక సమావేశం జరిగే ప్రణాళిక ఉందని విజయ్ గోఖలే తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రతినిధి స్థాయిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అమేథీలో రైఫిల్ యూనిట్ ఏర్పాటు చేయడంలో సహాయానికి పుతిన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.