సౌదీ సీనియర్ మంత్రులతో మోడీ భేటీ

సౌదీ సీనియర్ మంత్రులతో మోడీ భేటీ

భారత్, సౌదీ అరేబియా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చలు జరిపారు. సౌదీ సీనియర్ మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వాటర్ టెక్నాలజీ, కార్మికుల విషయాల్లో భాగస్వామ్యంపై చర్చ జరిగింది. సౌదీ సీనియర్ మంత్రులతో మోడీ సమావేశాలు ఫలప్రదంగా జరిగాయని పీఎంఓ ప్రకటించింది. సౌదీ అరేబియా వ్యవసాయ మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ మొహీన్ తో భేటీ అయిన మోడీ వ్యవసాయంలో రెండు దేశాల భాగస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. పర్యావరణ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.

గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడం, గ్రీనరీ పెంచడం వంటి విషయాలపైనా చర్చ జరిగింది. కార్మిక మంత్రి అహ్మద్ బిన్ సులేమాన్ అల్ రజీతో సమావేశమైన మోడీ ప్రవాస భారతీయ కార్మికుల సమస్యల్ని ప్రస్తావించారు.  ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార విస్తరణను ఐదు అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు ప్రధాని మోడీ. సౌదీ అరేబియా ఫైనాన్షియల్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పర్యావరణం, బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ కీలకంగా మారాయని చెప్పారు మోడీ. గత శతాబ్ద కాలంలో సౌదీ అరేబియా పట్టిందల్లా బంగారంగా మారిందని, దీంతో ఇక్కడి పాలకులు కొత్త ఆలోచనలపై దృష్టి పెట్టలేదన్నారు ప్రధాని మోడీ. అయితే క్రౌన్ ప్రిన్స్ మాత్రం భవిష్యత్ సవాళ్ల గురించి ఆలోచించి దావోస్ ఇన్ డిజర్స్ సదస్సుకు అంకురార్పణ చేసినందుకు ఆయన్ను అభినందిస్తున్నానని చెప్పారు.