రాజీవ్ గాంధీని స్మరించుకున్న మోడీ

రాజీవ్ గాంధీని స్మరించుకున్న మోడీ

దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. 'మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు...' అని పేర్కొంటూ  ఓ ట్వీట్‌ చేశారు. ఇటీవల రాజీవ్‌గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన మోడీ.. ఇవాళ ఆయణ్ను స్మరించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

మరోవైపు.. రాజీవ్ స్మారకమున్న వీర్‌భూమి వద్ద యూపీఏ ఛైర్ పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,   ప్రియాంకా గాంధీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు.