చెత్త ఏరేప్పుడు మోడీ చేతిలో ఉన్న పరికరం ఏంటంటే ?

చెత్త ఏరేప్పుడు మోడీ చేతిలో ఉన్న పరికరం ఏంటంటే ?

తమిళనాడులోని మహాబలిపురంలో చైనా ప్రధానితో భేటీకి వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తాను స్టే చేసిన బీచ్‌లో చెత్తను స్వయంగా తొలగించి అబ్బుర పరచిన సంగతి తెలిసిందే. బీచ్ లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సమయంలో ప్రధాని మోదీ తన చేతిలో టార్చ్‌ వంటి పరికరాన్ని పట్టుకున్నారు. అది టార్చ్‌లైట్‌ అని కొందరు, స్లిమ్ గా ఉన్న డంబెల్‌ అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశాడురు. దీని గురించి ప్రధాని మోడీకి ప్రశ్నలు వెల్లువలా వచ్చి పడుతుండడంతో స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘మామల్లాపురంలో నేను చెత్త తీస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న పరికరం గురించి నిన్నటి నుంచి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌. నేను దాన్ని తరచుగా వాడుతుంటాను. ఎందుకంటే నాకది ఎంతో మేలు చేసింది’ అని ట్వీట్‌ చేశారు. ఆక్యుప్రెజర్‌ రోలర్‌ అనేది చేతిలో ఇమిడిపోయే ఒక రకమైన వ్యాయామ పరికరం. పొద్దున్నే దీన్ని ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.