రేపు అమేథికి ప్రధాని మోడీ 

రేపు అమేథికి ప్రధాని మోడీ 

ప్రధానమంత్రి మోడీ రేపు ఉత్తరప్రదేశ్ లోని రాహుల్ నియోజవర్గమైన అమేథి పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని భారీ బహిరంగ సభలో పాల్గోనున్నారు. అనంతరం ఆర్గన్స్ ఫ్యాక్టరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గాంధీ  కుటుంబానికి నమ్మకంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పర్యటన ఉత్కంఠరేపుతోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ అమేథి పర్యటన మొదటిది. డిసెంబర్ లో మోడీ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్ బరేలీలో పర్యటించారు. సీఎం యోగీ అథిత్యనాథ్ ఇప్పటికే  అమేథిలో పర్యటించి... ఏర్పాట్లను సమీక్షించారు. 2014 మే 5న అమేథి మోడీ  పర్యటించారు.