23 నుంచి ప్రధాని విదేశీ పర్యటన...

23 నుంచి ప్రధాని విదేశీ పర్యటన...

భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు... ఈ సారి ఆఫ్రికాలోని మూడు దేశాల్లో పర్యటించనున్నారు మోడీ... ఈ నెల 23 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రధాని విదేశీ పర్యటన సాగనుంది. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు రువాండ దేశంలో,  ఆ తర్వాత 24, 25 తేదీల్లో ఉగాండాలో పర్యటించి... ఉగాండా పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు భారత ప్రధాని... తర్వాత సౌతాఫ్రికాకు వెళ్తారు. సౌతాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్‌లో జరిగే బ్రిక్స్ దేశాల సమావేశంలో పాల్గొంటారు నరేంద్ర మోడీ. అయితే ఈ సారి మోడీ పర్యటనకు ఓ విశేషం ఉంది... ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ఏ ప్రధాని కూడా రువాండలో పర్యటించలేదు... ఆ దేశంలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోడీయే కానున్నారు. తన పర్యటన రువాండతో రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేయనుండగా... బ్రిక్స్ సమ్మిట్‌లో అంతర్జాతీయ శాంతి, భద్రతకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరుపుతారు. బిక్స్ సమ్మిట్‌లో భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా పాల్గొంటాయి.