శ్రీవారి సేవకు ప్రధాని మోడీ..

శ్రీవారి సేవకు ప్రధాని మోడీ..

భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.30 గంటలకు కోలంబో నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు మోడీ. అయితే, ప్రధానికి గవర్నర్ నరసింహన్‌, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలు, మంత్రులు స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4.40 నుంచి 5.10 మధ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5.10 గంటలకు రోడ్డుమార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.15 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు ప్రధాని. ఆ వెంటనే తిరిగి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. రాత్రి 8.15 గంటలకు ప్రత్యేక విమానం ఢిల్లీకి బయల్దేరనున్నారు నరేంద్ర మోడీ. ఇక ప్రధాని పర్యటన దృష్ట్యా.. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమల వరకు పటిష్ట భద్రతాఏర్పాట్లు చేశారు పోలీసులు.