శ్రీవారి సేవలో ప్రధాని మోడీ (ఫోటోలు)

శ్రీవారి సేవలో ప్రధాని మోడీ (ఫోటోలు)

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు మేళతాళాలతో స్వాగతం పలికి ఆయనను శ్రీవారి సన్నిధికి ఆహ్వానించింది. ధ్వజస్తంభానికి మొక్కుకుంటూ శ్రీవారి సన్నిధికి ప్రధాని వెళ్లారు. మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ప్రధానికి స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేయగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను ప్రధానికి అందజేశారు.