పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన మోదీ

పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల నేపాల్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయాన్నే ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ కత్మండులోని పశుపతినాథ్ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఐఏఎఫ్ చాపర్‌లో కత్మండుకు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు పశుపతినాథ్ దేవాలయం ప్రతిమను మోదీకి బహుకరించారు. ఆ తర్వాత మోదీ కత్మండులోని హయత్ రెజెన్సీకి చేరుకొని.. నేపాల్ లోని కీలక నాయకులతో జరిపే చర్చల్లో పాల్గొంటారు. ఆపై ఖాట్మండు మెట్రో పాలిటన్ సిటీ నిర్వహించే రిసెప్షన్ లో పాల్గొన్న తర్వాత మోడీ తిరిగి ఢిల్లీకి ప్రయాణం అవుతారు.