కాంగ్రెస్ కు ప్రచారం చేయనున్న మోదీని పోలిన వ్యక్తి

కాంగ్రెస్ కు ప్రచారం చేయనున్న మోదీని పోలిన వ్యక్తి

నరేంద్ర మోదీ ఈ సారి బీజేపీ తరపున ప్రచారం చేయట్లేదు. అదేంటి బీజేపీ పార్టీ నుండి గెలిచి, ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోదీ.. బీజేపీ తరపున ప్రచారం చేయట్లేదు అనుకుంటున్నారా?. విషయంలోకి వస్తే.. ప్రధాని నరేంద్ర మోదీని పోలి ఉండే అభినందన్ పాఠక్ గత ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన అభినందన్ పాఠక్ గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసాడు. ఇప్పుడు ప్రభుత్వ పని తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కోపంతో కూడా ఉన్నారని.. అందుకే కాంగ్రెస్‌లో చేరి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

'ప్రధాని నరేంద్రమోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. వాస్తవానికి ఆయన ఏమనుకుంటున్నారో తెలియట్లేదు అని పాఠక్ తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మంచి రోజులు ఎప్పుడొస్తాయ్ అని అడుగుతున్నారన్నారు. నేను చాల సార్లు ప్రజలతో నిందించబడ్డాను. మరలా ఆ తప్పు చేయబోనని నిర్ణయించుకుని.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తానని' తెలిపారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌  బబ్బర్‌ను కలిశానని.. సోనియాగాంధీతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారని పాఠక్ అన్నారు.