కిత్నా అచ్ఛా హై మోడీ!

కిత్నా అచ్ఛా హై మోడీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జపాన్ లోని ఒసాకాకు చేరుకున్నారు. ఇవాళ సదస్సు రెండో రోజు. ఒసాకాకి వచ్చిన అనేక దేశాధినేతలతో భేటీ సందర్భంగా ప్రధాని మోడీ ఫోటోలు తీయించుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఫోటోని షేర్ చేశారు. ఇందులో ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన ప్రధాని మోడీతో చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ తీసుకున్నారు. శనివారం ఈ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆస్ట్రేలియా ప్రధాని 'కిత్నా అచ్ఛా హై మోడీ!' అని రాశారు. 

జపాన్ లోని ఒసాకా నగరంలో జీ-02 శిఖరాగ్ర సదస్సుతో పాటు శుక్రవారం బ్రిక్స్ నేతల అనధికారిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదం మానవతకు అతిపెద్ద ప్రమాదం అని చెప్పారు. ఉగ్రవాదం అమాయకులను హత్య చేయడమే కాకుండా ఆర్థికాభివృద్ధిని, సామాజిక సుస్థిరతకను కూడా తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. ఉగ్రవాదం, జాత్యంహకారాన్ని ఏ విధంగానూ మద్దతు ఇవ్వరాదని సూచించారు.