శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానికి మోడీ ఫోన్‌..

శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానికి మోడీ ఫోన్‌..

శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రిలకు ఆయన కొద్దిసేపటి క్రితం ఫోన్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ఆపదలో ఉన్న శ్రీలంకు ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మన ఉపఖండంలో ఇలాంటి ఆటవిక దాడులకు స్థానం లేదన్న మోడీ.. కష్టకాలంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.