విరుష్క జంటకు ధన్యవాదాలు, అభినందనలు ఒక్కేసారి చెప్పిన పీఎం...

విరుష్క జంటకు ధన్యవాదాలు, అభినందనలు ఒక్కేసారి చెప్పిన పీఎం...

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటను అభిమానులు అందరూ విరుష్క జంట అని పిలుస్తారు. అయితే ఈ జంటకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కేసారి ధన్యవాదాలు, అభినందనలు చెప్పారు. అయితే నిన్న మోదీ 70 వ పుట్టినరోజు సందర్బంగా భారత ప్రజలు, సెలబ్రెటీలు, రాజకీయనాయకులు, ఆటగాళ్లు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ కి వెళ్లిన విరాట్ కూడా ట్విట్టర్ వేదికగా పీఎం కు బర్త్ డే విషెస్ తెలిపాడు. ఆ ట్విట్ కు మోదీ స్పందిస్తూ... ధన్యవాదాలు విరాట్ కోహ్లీ. నేను కూడా అనుష్కశర్మను మరియు నిన్ను అభినందించాలనుకుంటున్నాను. మీరు అద్భుతమైన తల్లిదండ్రులు అవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!'' అని తెలిపారు. ఈ మధ్యే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. నేను త్వరలో తండ్రి కాబోతున్నానని కోహ్లీ తన ట్విట్టర్ లో చెప్పిన విషయం తెలిసిందే. డిసెంబర్ 11, 2017 న పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.