జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు

జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వమైన ఘన విజయం సాధించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం అభినందించారు. 'ప్రియమైన వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను' అని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ఇంగ్లిష్, తెలుగులో జగన్ ను తన ట్విట్టర్ సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.