సెన్సార్ పూర్తి చేసుకున్న పిఎం నరేంద్ర మోడీ

సెన్సార్ పూర్తి చేసుకున్న పిఎం నరేంద్ర మోడీ

మోడీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా పిఎం నరేంద్ర మోడీ.  వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది.  130 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ఏప్రిల్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  

ఎన్నికలకు ముందు సినిమాను రిలీజ్ చేస్తే... దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని ఎన్నికల తరువాత సినిమాను రిలీజ్ చేసే విధంగా అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీ వాదనలను కోర్టు పట్టించుకోలేదు.  సినిమా చూసిన తరువాత అభ్యంతరాలు ఏంటో చెప్పమని చెప్పడంతో సినిమా రిలీజ్ కు మార్గం సుగమం అయ్యింది.  పైగా సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ రావడం కలిసొచ్చిందనే చెప్పొచ్చు.