గూగుల్ సీఈఓ తో మోడీ చర్చ..డిజిటల్ ఇండియా పై గూగుల్ ఆసక్తి..!

 గూగుల్ సీఈఓ తో మోడీ చర్చ..డిజిటల్ ఇండియా పై గూగుల్ ఆసక్తి..!

ఈరోజు ఉదయం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో ప్రధాని మోడీ సుదీర్ఘంగా చర్చించారు. కాగా ఈ చర్చలో  అంశాలపై మాట్లాడినట్టు మోడీ ట్వీట్ చేసారు. ముఖ్యంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలు, యువత, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువర్తింప చేయడంపైనా ఆసక్తికర చర్చ జరిగిందని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో సరికొత్త తరహా ఉద్యోగ సంస్కృతి ఏర్పడడంపై చర్చించామని అన్నారు . డేటా భద్రత, ఇంటర్నెట్ రక్షణ అంశాల ప్రాధాన్యత గురించి కూడా మాట్లాడుకున్నామన్నారు. విద్య, విజ్ఞానం, డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాల్లో గూగుల్ చేపడుతున్న చర్యలు ముగ్ధుడ్ని చేశాయని మోడీ పేర్కొన్నారు. కాగా ఈ అంశంపై సుందర్ పిచాయ్ మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ట్వీట్ చేసారు. మా కోసం ఎంతో విలువైన సమయం కేటాయించారంటూ ప్రధానికి థాంక్స్ చెప్పారు.  "డిజిటల్ ఇండియా కోసం మీ తపన ఎంతో ఆశావాహభావన కలిగిస్తోంది. ఈ దిశగా గూగుల్ తన కృషిని కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఉంది" అంటూ పిచాయ్ ట్వీట్ చేసారు. ఇదిలా ఉండగా గూగుల్ భారత్ లో రూ.75 వేల కోట్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటించినట్టు తెలుస్తోంది.