పాక్ తో ఉగ్రవాదంపై చర్చల కాలం ముగిసింది

పాక్ తో ఉగ్రవాదంపై చర్చల కాలం ముగిసింది

పుల్వామా ఉగ్రవాద దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్థాన్ కు మరో హెచ్చరిక చేశారు. ఇక పాక్ తో ఉగ్రవాదంపై పోరాటం గురించి చర్చించే సమయం ముగిసిపోయిందని చెప్పారు. కలిసికట్టుగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఉగ్రవాదంపై, దానిని విస్తరింపజేస్తున్న వారిపై ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 'అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు ఉగ్రవాదంపై మాట్లాడుతూ వచ్చాం. ఉగ్రవాద బాధిత దేశాలతో భారత్ నిరంతరం చర్చలు జరుపుతూ వచ్చింది. ఇక దీనిపై కఠిన చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని' మోడీ అన్నారు.

అర్జెంటినా అధ్యక్షుడు మౌరిసియో మాక్రితో చర్చల అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదులు, వారికి సహకరించేవారిని ఉపేక్షించడం ఉగ్రవాదానికి ప్రోత్సాహమివ్వడమేనని చెప్పారు. ఇరు దేశాల మధ్య సమాచార ప్రసార సాధన వ్యవస్థ, అణుఇంధనం, వ్యవసాయంతో సహా పలు రంగాల్లో పరస్పర సహకారానికి అంగీకారం కుదిరింది. 10 ఎంవోయులపై తుది నిర్ణయం జరిగింది.