రివ్యూ: పీఎం నరేంద్రమోడీ

రివ్యూ: పీఎం నరేంద్రమోడీ

నటీనటులు: వివేక్‌ ఒబెరాయ్‌, మనోజ్‌ జోషి, ప్రశాంత్‌ నారాయణ్‌, బొమన్‌ ఇరానీ తదితరులు

మ్యూజిక్: హితేశ్‌ మోదక్‌, ఏ.ఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: సునీతా రాడియా
నిర్మాణ సంస్థ: లెజెండ్‌ గ్లోబల్‌ స్టూడియో, ఆనంద్‌ పండిట్‌ మోషన్‌ పిక్చర్స్‌
స్క్రీన్‌ప్లే: అనిరుధ్‌ చావ్లా, వివేక్‌ ఒబెరాయ్‌
దర్శకత్వం: ఒమంగ్‌ కుమార్‌

ఇటీవల కాలంలో బాలీవుడ్ లో బయోపిక్ సినిమాల హవా కొనసాగుతోంది.  స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సెలెబ్రిటీల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలను తెరకెక్కించి విజయం సాధిస్తున్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన పీఎం నరేంద్ర మోడీ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  గత రెండు నెలలుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమాను ప్రజలు ఎంతవరకు ఆమోదించారో ఇప్పుడు చూద్దాం.  

కథ: 

చిన్నతనంలో మోడీ చాయ్ అమ్ముతూ కుటుంబానికి సహాయపడుతుండేవాడు.  స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటాడు.  కొద్దిగా పెద్దయ్యాక ఆద్యాత్మికం వైపు మనసు మళ్లుతుంది.  హిమాలయాలకు వెళ్లి కొన్నాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తాడు.  అక్కడి నుంచి వచ్చాక ఆర్ఎస్ఎస్ లో చేరడం అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అక్కడి నుంచి ఎలా ఎదిగారు..? రాజకీయాల్లో ఎలా సంచలనం సృష్టించారు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

బాలీవుడ్ కు బయోపిక్ లు కొత్తేమి కాదు.  అలాగే దర్శకుడు ఒమంగ్ కుమార్ కు బయోపిక్ లు తీయడం అంతకంటే కొత్తేమి కాదు.  గతంలో సరబ్ జీత్ అనే బయోపిక్ ను తీసి సంచలనం సృష్టించాడు.  ఇప్పుడు మోడీ కథతో బయోపిక్ చేశారు.  ఎన్నో వివాదాలతో కూడుకున్న మోడీ జీవితాన్ని సినిమా కథగా మార్చి తెరకెక్కించాలంటే చాలా కష్టం.  ఎంతో పరిశోధన చేయాలి.  ఇందులో అలా చేసినట్టు ఏమి కనిపించలేదు.  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానిగా ఎదిగే సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలు వంటివి బాగా చూపించి ఉంటె సినిమా మరోలా ఉండేది.  సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం మోడీ చేపట్టిన ర్యాలీలు, ప్రసంగాలు వంటి వాటితో నింపేశారు. సామాన్య ప్రజలకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా ఫ్యాన్స్ కు సినిమా నచ్చుతుంది.  

నటీనటుల పనితీరు:  

వివేక్ ఒబెరాయ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.  మేకప్ తో పాటు ఆయనలా అనుకరించిన తీరు ఆకట్టుకుంది.  ప్రసంగాలు చేసిన విధానం బాగుంది. వివేక్ తో పాటు అమిత్ షా పాత్రలో నటించిన మనోజ్ జోషి నటన కూడా ఆకట్టుకుంది.  మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు నటించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

దర్శకుడు ఒమంగ్ కుమార్ సినిమాను మలిచిన తీరు బాగున్నా... ఇంకాస్త ఎఫెక్టివ్ గా చెప్పి ఉంటె ఇంకా బాగుండేది. మోడీని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపించింది.  సన్నివేశాలకు తగ్గట్టుగా మ్యూజిక్ ఉండటం విశేషం. 

పాజిటివ్ పాయింట్స్: 

వివేక్ నటన 

కథ 

సంగీతం 

నెగెటివ్ పాయింట్స్: 

స్క్రిప్ట్ 

చివరిగా: పీఎం నరేంద్ర మోడీ - వివేక్ వన్ మ్యాన్ షో