సోనియా గాంధీ పుట్టినరోజు.. మోడీ, ప్రముఖుల శుభాకాంక్షలు..

సోనియా గాంధీ పుట్టినరోజు.. మోడీ, ప్రముఖుల శుభాకాంక్షలు..

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు తన 73వ పుట్టిన జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం జీవించాలంటూ మోడీ ట్వీట్ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాల కారణంగా సోనియా గాంధీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం లేదని మహిళా కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి.. సోషల్ మీడియా వేదికగా సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేటితో తెలంగాణ ప్రకటన చేసి పదేల్లు అయ్యింది అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు రేవంత్. ఇక, కాంగ్రెస్ నేతలతో పాటు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.