మళ్ళీ సుప్రీం కోర్టుకు చేరిన నమో బయోపిక్

మళ్ళీ సుప్రీం కోర్టుకు చేరిన నమో బయోపిక్

పిఎం నరేంద్రమోడీ సినిమా రిలీజ్ ను ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.  ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో సినిమా ఎక్కడా రిలీజ్ కాలేదు.  దీంతో ఈ సినిమా నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోతే వచ్చే నష్టాల గురించి పిటిషన్ లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ స్వీకరించింది.  

సోమవారం ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.  అంతకు ముందు సుప్రీం కోర్ట్ ఈ సినిమా రిలీజ్ వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ కు వదిలేసిన సంగతి తెలిసిందే.  కాగా, రిలీజ్ కు ముందు రోజు అంటే 10 వ తేదీన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధం అవుతున్న తరుణంలో.. సినిమాను రిలీజ్ ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో సినిమా ఆగిపోయింది.