మోడీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం

మోడీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం

జనవరి 7 వ తేదీన మోడీ బయోపిక్ లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.  అదే రోజున పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ, ఇంగ్లీష్ వంటి ఐదు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  వివేక్ ఒబెరాయ్ ప్రధాని మోడీ పాత్రలో కనిపిస్తున్నారు.  

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచి అహ్మదాబాద్ లో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ ఎన్నిరోజు జరుగుతుందనే విషయం తెలియాలి.  మేరీ కోమ్, సరబ్జీత్ వంటి బయోపిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.